35 కోట్లతో ట్రంక్ రోడ్ అభివృద్ధి

35 కోట్లతో ట్రంక్ రోడ్ అభివృద్ధి

కనకపట్టణ అభివృద్ధి థౌజెండ్(1000)వాలా టపాకాయల రేంజ్ లో గుక్క తిప్పుకోకుండా ఆ శాసనసభ్యుడు అనర్గళంగా ప్రకటిస్తుంటే రహదారి పై వాహనాల తాకిడి శబ్దం మూగబోగ ఆ ప్రాంతం కొద్దిసేపు నిశ్శబ్ద అలుముకోగా  ప్రజలు ఆసక్తిగా ఆయన మాటలు ఆలకిస్తూన్న ఘటన నెల్లూరు జిల్లా కావలి పట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో చోటు చేసుకుంది. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 35 కోట్ల రూపాయలతో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి ప్రారంభించారు. సంవత్సర కాలం లోపల పని పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి..

కావలి పట్టణంలోని 40 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ప్రజలకు వివరించారు. ఆగస్టు 15 తేదీన మందడి చెరువు అభివృద్ధి వెంకటేశ్వర థియేటర్ రోడ్డు విస్తరణ పోలీస్ గ్రౌండ్స్ వాకింగ్ ట్రాక్ మరియు బుడంగుంట కాలనీ వరకు విద్యుత్ దీపాలంకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తమన్నారు ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts