కావలిలోని IAS EM హై స్కూల్ లో ఘనంగా 21వ వార్షికోత్సవ వేడుకలు.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
కావలి, శుక్రవారం-03
నెల్లూరు జిల్లా,కావలి పట్టణంలోని IAS EM హై స్కూల్ లో 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు.కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి స్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, “విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని” ఆకాంక్షించారు. విద్య ద్వారానే జీవితంలో విజయాలు సాధ్యమని, ప్రతిఒక్కరూ తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.