అల్లూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే హామీ.
కావలి, అల్లూరు: శుక్రవారం-03
నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో శుక్రవారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే ఆత్మీయంగా కలుసుకున్నారు. ప్రజల సమస్యలను నేరుగా విన్న ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజా దర్బార్‌లో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూమి వివాదాలు వంటి పలు అంశాలపై ప్రజలు తమ సమస్యలను వ్యక్తం చేశారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి,సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరగా తీసుకురావడం మా లక్ష్యం. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించడం కోసం నిరంతరం కృషి చేస్తాం” అని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అల్లూరు మండల అభివృద్ధిపై కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని,రహదారుల అభివృద్ధి,తాగునీటి సదుపాయాల మెరుగుదల, వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.రైతాంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు అవసరమైన నీటి వనరులు, ఎరువులు, విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.“రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది. రైతుల సమస్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను.
రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటాను” అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో పెరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులురెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ పలగాటి శ్రీనివాసరెడ్డి, అల్లూరు పట్టణ అధ్యక్షులు రామిశెట్టి కృష్ణ చైతన్య, మండల ప్రధాన కార్యదర్శి అంబటి రాజేంద్ర, రాష్ట్ర కమిటీ కార్యదర్శి రేబాల శంకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు, బండి అమర్ రెడ్డి,సామంతుల కిరణ్ కుమార్ రెడ్డి,సాగునీటి సంఘం అధ్యక్షులు మేడ కృష్ణారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు కలికి చంద్రశేఖర్ రెడ్డి,మండల జనసేన అధ్యక్షులు కారుమంచి కార్తీక్ శర్మ, గద్దగుంట ఎంపీటీసీ చెముకుల చంగయ్య,మండల PACS అధ్యక్షులు,ఎందటి హరికృష్ణ, మర్రిపోయిన సురేంద్ర,ఊటు శ్రీకాంత్ రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.