72 కోట్లతో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో విద్యుత్ వెలుగులు రైతులు రెండవ పంటకు సిద్ధంగా ఉండండి - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి

72 కోట్లతో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో విద్యుత్ వెలుగులు రైతులు రెండవ పంటకు సిద్ధంగా ఉండండి - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి - పి.ఎం. సూర్య ఘర్ ఉత్సవ్ యోజన కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే 

కావలి నియోజకవర్గంలో రూ.72 కోట్లతో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో విద్యుత్ వెలుగులు నింపుతున్నామని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. పి.ఎం. సూర్య ఘర్ ఉత్సవ్ యోజన ప్రారంభోత్సవ కార్యక్రమం కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం గ్రామంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభోత్సవం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని 5886 మంది ఎస్సీ మరియు ఎస్టీ వినియోగదారులకు ఉచిత సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం రూ. 72,41,90,445 నిధులు ఈ పధకానికి వెచ్చించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువకుని వలే నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో ఉచితంగా విద్యుత్ వెలుగులు నింపుతున్నారన్నారు. రెండవ విడతలో మరింత మందికి లబ్ది చేకూరనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు కాని వారికి రూ.78,000 సబ్సిడీ తో సోలార్ ప్యానెల్స్ అందజేస్తున్నామని తెలిపారు. చలంచర్ల, కొత్తపల్లి, ఆర్ సి పాలెం గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు ద్వారా సాగునీటిని అందించడం కోసం కృషి చేస్తున్నామని, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. కావలి నియోజకవర్గంలో రెండవ పంటకు కూడా నీరు అందిస్తామని, రైతులు నిర్భయంగా పంటలు వేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, విద్యుత్ శాఖ ఈఈ బెనర్జీ, అల్లూరు ఏడిఈ రవి చంద్ర, కావలి ఏడిఈ రవికుమార్, విద్యుత్ శాఖ ఏఈలు, సిబ్బంది, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి,స్థానిక నాయకులు గుంటూరు మల్లిఖార్జున, గుర్రం సునీల్, తదితరులు పాల్గొన్నారు.


google+

linkedin

Popular Posts