అల్లూరులో ఘనంగా టీడీపీ మహానాడు-2026 కార్యక్రమం
క్లస్టర్-11 సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
కావలి, గురువారం:28
కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్-11 కు సంబంధించిన మహానాడు కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అనంతరం కావలి నియోజకవర్గ పరిశీలకులు జయంతి బాబు, పార్టీ నాయకులతో కలిసి తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమ ప్రాంగణం మొత్తం పసుపు కండువాలు, పార్టీ జెండాలతో కళకళలాడింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగువారికి తెలుగుదేశం పార్టీ మహానాడు ఒక పండగ వంటిదని పేర్కొన్నారు. కావలి నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు, అభిమానులు మహానాడు కార్యక్రమాలను పండగ వాతావరణంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో అల్లూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.ఇటీవల మండలంలోని కొన్ని గ్రామాలకు స్వయంగా వెళ్లినప్పుడు ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించానని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో త్వరలో అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి నీటి కష్టాలను పూర్తిగా తీర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, నాయకుడు ఒక కుటుంబ సభ్యుడిలా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, మహిళా నాయకులు, యువత, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.