సీఎం పర్యటన విజయవంతం చేసిన అందరికీ కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అభినందనలు

 సీఎం పర్యటన విజయవంతం చేసిన అందరికీ కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అభినందనలు

తుమ్మలపెంట “మత్స్యకార సేవలో” కార్యక్రమం ఘన విజయం

కావలి, మే 19 :

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుమ్మలపెంటలో నిర్వహించిన “మత్స్యకార సేవలో” కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కావలి శాసనసభ్యులుకావ్య కృష్ణారెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన–బీజేపీ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు శాఖ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీఎం పర్యటన విజయవంతంగా పూర్తయిందన్నారు.ముఖ్యంగా మత్స్యకార గ్రామాల ప్రజలు అపూర్వ స్పందనతో పెద్ద ఎత్తున సభకు హాజరై ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని చాటిచెప్పారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.తుమ్మలపెంట ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించిందని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకార భరోసా ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు తీరప్రాంత గ్రామాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.సభా ప్రాంగణం ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాల్లో అధికారులు అహర్నిశలు శ్రమించారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయడం అభినందనీయమన్నారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు.ఇదే ఉత్సాహం, ఇదే సమన్వయంతో భవిష్యత్తులో కూడా ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులను కోరారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.



google+

linkedin

Popular Posts