అడవి రాజుపాలెం రైల్వే అండర్‌పాస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

అడవి రాజుపాలెం రైల్వే అండర్‌పాస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

కావలి, శనివారం:30

కావలి నియోజకవర్గ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అడవి రాజుపాలెం రైల్వే అండర్‌పాస్ నిర్మాణ పనులను శనివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మద్దూరుపాడు సమీపంలోని ఎల్‌సీ నెం.160 వద్ద జరుగుతున్న అండర్‌పాస్ నిర్మాణ పనులను రైల్వే అధికారులతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే,పనుల పురోగతిపై సమగ్రంగా ఆరా తీశారు.ఈ సందర్భంగా రైల్వే అధికారులు నిర్మాణ పనుల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. అండర్‌పాస్ నిర్మాణంలో సాంకేతిక అంశాలు, పనుల పూర్తి గడువు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అధికారులతో చర్చించారు.

పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అండర్‌పాస్ నిర్మాణం పూర్తయితే మద్దూరుపాడు, పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా అండర్‌పాస్ నిర్మించాలని అధికారులకు సూచించారు.

ఈ అండర్‌పాస్  పూర్తయిన తర్వాత కావలి వైకుంటపురం,పెంకులు ఫ్యాక్టరీ  ప్రాంత ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు అత్యవసర సేవల రాకపోకలు కూడా సులభతరం అవుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారులు,ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


google+

linkedin

Popular Posts