ఆకుల సువార్తమ్మ ద్వితీయ జ్ఞాపకార్థ స్మారక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

ఆకుల సువార్తమ్మ ద్వితీయ జ్ఞాపకార్థ స్మారక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలి, శనివారం:30

జర్నలిస్ట్ హ్యాపీ తల్లి, పాస్టర్ యేసుబాబు గారి సతీమణి ఆకుల సువార్తమ్మ ద్వితీయ జ్ఞాపకార్థ స్మారక కార్యక్రమం కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలోని వారి నివాసంలో శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, ఆకుల సువార్తమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సువార్తమ్మ కుటుంబ విలువలకు, ఆధ్యాత్మిక సేవలకు ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆమె చూపిన ప్రేమ, సేవాభావం, మానవతా దృక్పథం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా పరిచయస్తులకు కూడా ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.సువార్తమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవలో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ యేసుబాబు కుటుంబ సభ్యులు, బంధువులు, క్రైస్తవ మత పెద్దలు, స్థానిక నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆకుల సువార్తమ్మకు ఘన నివాళులర్పించారు.

google+

linkedin

Popular Posts