గ్యాస్ సిలిండర్ ప్రమాద బాధితురాలికి అండగా నిలిచిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు
అల్లూరు,ఆదివారం: 06-09-2026
అల్లూరు మండలం, పురిణి పంచాయతీ పరిధిలోని తుఫాన్ నగర్‌లో ఇటీవల అళ్లపాక నిర్మల గారి నివాసంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఆదివారం స్థానిక పార్టీ నాయకులతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని, కాలిపోయిన ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ — "బాధిత కుటుంబానికి ప్రభుత్వం మరియు పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటాం" అని హామీ ఇచ్చారు.అనంతరం, నిర్మల గారు వెంటనే ఇల్లు నిర్మించుకోవడానికి సహాయపడేలా వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ పర్యటనలో ఎమ్మెల్యే గారి వెంట అల్లూరు మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..