కావలి యువత అభివృద్ధి ఫలాలు చూడబోతుంది
రానున్న రోజుల్లో కావలి నియోజకవర్గం యువత అభివృద్ధి ఫలాలను చూడబోతుందని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండబోతున్నాయని, పారిశ్రామిక వాడగా కావలి విస్తరించబోతుందని, కావలి అభివృద్ధిని చూసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కావలి టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన కావలి అభివృద్ధిపై విస్తారంగా వివరించారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకునే రోజులు ఇక ఉండబోవని, మన కావలి నీ కనకపట్నం దిశగా మలుచుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు పోతుంది అని, ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని గుర్తు చేశారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో కావలి మున్సిపాలిటీ బలైందని, తద్వారా ఎన్నికలు జరగని కారణంగా అభివృద్ది లేకుండా పోయిందని, 70 కోట్ల రూపాయలు నిధులు రాకుండా పోయాయి అని గుర్తు చేశారు.
తిరిగి ఏడేళ్ల తర్వాత కావలి మున్సిపల్ ఎన్నికలు జరగ నున్నాయని వెల్లడి చేశారు.
కావలి అభివృద్ధి కోసం పనిచేసే అభ్యర్థులకు ప్రజలు ఓటు వేయాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. కావలి మున్సిపాలిటీ లోని 44 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి పనులే తమ అభ్యర్థులకు ప్రధాన ఆయుధమని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కావలి చెరువుకు సోమశిల నీటిని తీసుకొచ్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని వెల్లడి చేశారు. ఎన్నికల సమయంలో వేషధారులు వస్తారూ, పోతారు అని, అది ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.
కావలిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించాలని ఆదరించాలి అన్నారు. పట్టణం లోనీ అన్ని బజార్లలో వ్యాపారం విస్తరించే విధంగా దుఃఖాలు ఏర్పాటు చేసి, అన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు విస్తరించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వెల్లడి చేశారు.
కావలి పట్టణంలో 420 కోట్ల నిధులతో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రతి చోట గ్రావెల్ తొలి అభివృద్ధి చేసి, పచ్చదనం నకు ప్రాధాన్యతను ఇస్తున్నాము అన్నారు.
కావలిలో అనేక శ్మశాన వాటికలను అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.
పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్సీల సమస్యల వద్ద నీరు నిలవటం అలా ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతాము అన్నారు.
పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని వెల్లడి చేశారు. ప్రధాన రహదారులను కమర్షియల్ హబ్లుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకున్నామని, జనతపేటలో వ్యాపారాల అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కావలి అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక నిధులు మంజూరు చేస్తున్నారు అని కొనియాడారు.
అమృత్-2 పథకం కింద 40 కోట్లు రూపాయలు మంజూరు, మరో ఏడు నెలల్లో ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు దూసుకు పోతున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ పథకం కింద 12 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి చేశారు. కావలిలో పాత డంపింగ్ యార్డును సుందరీకరించి పార్కుగా అభివృద్ధి చేస్తామన్నారు. కావలి పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని వెల్లడి చేశారు. కావలి పట్టణంలో పార్కులకు అభివృద్ధికి శ్రీకారం చుట్టపోతున్నాం అన్నారు.
జనవరిలో బిపిసిఎల్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ ద్వారా శంకుస్థాపన జరగనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటన చేశారు.
ఆ ప్రాజెక్టు కావలికి మణిహారంగా మారనుందని అన్నారు. అనేమడుగు ప్రాంతంలో సుమారు 1,000 ఎకరాల్లో బిపిసిఎల్ అనుబంధ పెట్రో కెమికల్ హబ్ గా అభివృద్ధి కానుందని వెల్లడి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఎమ్మెల్యే ప్రకటనచేశారు. కావలి పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి యు ఐ డి ఎఫ్ ద్వారా 146 కోట్ల రూపాయలు నిధులు రానున్నాయని వెల్లడి చేశారు. 435 కోట్లతో సీసీ రోడ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇంతటి అభివృద్ధి పనులు జరుగుతున్నా ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలి అని ఎమ్మెల్యే తెలియజేస్తూ, ప్రతిపక్షాన్ని విమర్శ చేశారు.
పాపిరెడ్డి చెరువు అభివృద్ధికి 3.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆక్రమణకు గురైన గుంటలను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నామని ప్రకటన చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 212 మందికి 1.20 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ చేయనున్నట్లు వెల్లడి చేశారు.
కావలి అభివృద్ధికి మొత్తం 425 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నామని ఎమ్మెల్యే ప్రకటన చేశారు..
ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, టిడిపి సీనియర్ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, సోమశిల మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, టిడిపి లీగల్ సెల్ పొట్లూరి శ్రీనివాసులు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు దావులూరు దేవకుమార్, కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు అధ్యక్షులు మాలపాటి నాగేశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏగూరు చంద్రశేఖర్, తట్టవర్తి వాసు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- వేల సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు
- కావలి కనకపట్నం దిశగా పరుగులు
- కావలి విస్తరణ ప్రధాన ధ్యేయంగా ముందుకు
- ప్రజలందరూ అభివృద్ధిని చూచి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి
- ఎన్నికల వేళ వేషధారులు వస్తారు, పోతారు ప్రజలు గమనించండి
- 44 వార్డుల్లో అభ్యర్థులను గెలిపించండి