డాక్టర్ ప్రభాకర్ నాయుడు అంతిమయాత్రలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. స్వయంగా పాడి మోసి అభిమానాన్ని చాటుకున్న శాసనసభ్యులు

డాక్టర్ ప్రభాకర్ నాయుడు అంతిమయాత్రలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. స్వయంగా పాడి మోసి అభిమానాన్ని చాటుకున్న శాసనసభ్యులు

​​అశ్రునయనాల నడుమ డాక్టర్ ప్రభాకర్ నాయుడు అంతిమయాత్ర లో నడిపించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

​​డాక్టర్ ప్రభాకర్ నాయుడు అమర్ రహే.. ప్రజాప్రతినిధులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

​కావలి: సోమవారం, 05 2026

​నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో ప్రముఖ వైద్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి అంతిమయాత్ర సోమవారం అత్యంత అశ్రునయనాల నడుమ సాగింది. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు పాల్గొని డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు స్వయంగా పాడి మోసి, ఆయనపై తమకున్న ప్రత్యేక అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. ​శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మాజీ మంత్రి రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితర ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రభాకర్ నాయుడు గారి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసేవకు, వైద్యరంగానికి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు అందించిన నిరుపమాన సేవలను ఎమ్మెల్యే గారు స్మరించుకున్నారు.

​కావలి పట్టణంలోని రామ్మూర్తిపేటలోని ఆయన నివాసం నుండి ప్రారంభమైన అంతిమయాత్ర బాలకృష్ణ నగర్ స్మశానవాటిక వరకు కొనసాగింది. యాత్ర పొడవునా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలతో కలిసి అడుగులో అడుగు వేస్తూ నడిచారు. తమ ప్రియతమ వైద్యుడిని, నేతను కడసారి చూసేందుకు వచ్చిన వేలాది మంది పట్టణ ప్రజలు, రాజకీయ, సామాజిక, వైద్య రంగాల ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.

కావలిలో ప్రముఖ వైద్యులు,మాజీ మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న..ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

​శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర,మాజీ మంత్రి రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తదితరులతో కలిసి ప్రభాకర్ నాయుడుకి నివాళి అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

ప్రజాసేవకు, వైద్య రంగానికి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు అందించిన సేవలను స్మరించుకుంటూ, పాడి మోసి  ప్రభాకర్ నాయుడు గారిపై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

​కావలి పట్టణంలోని రామ్మూర్తిపేటలోని వారి నివాసం నుండి బాలకృష్ణ నగర్ స్మశానవాటిక వరకు అత్యంత అశ్రునయనాల నడుమ సాగిన డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి అంతిమయాత్ర.

​అంతిమయాత్ర పొడవునా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలతో కలిసి అడుగులో అడుగు వేస్తూ పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

​డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు రాజకీయ, సామాజిక, వైద్య రంగాల ప్రముఖులు 

కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చిన పట్టణ ప్రజలు మరియు అభిమానులు.




google+

linkedin

Popular Posts