9వ శ్రీశ్రీ గౌర నితాయ్ (కృష్ణ - బలరామ్) రథయాత్రను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. రథయాత్ర కావలి పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కు ఇస్కాన్ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. రథయాత్రలో పాల్గొన్న ఆయన రథం తో పాటు నడిచారు. పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎమ్మెల్యే రథయాత్రలో పాల్గొన్నారు.. సృష్టిలోని జీవరాసులలో మనిషి ప్రత్యేకతను ఈ సందర్భంగా వివరించారు. మానవ జన్మ కల్పించిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని, సాటివారికి సేవ చేయాలని కోరారు. హరే రామ, హరే కృష్ణ శ్లోకం గురించి వివరించి అందరినీ ఆకట్టుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)