​కీ.శే. ఇలింద్ర వరదరాజం శత జయంతి వేడుకలు:నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

​కీ.శే. ఇలింద్ర వరదరాజం శత జయంతి వేడుకలు:నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

​కావలి: ఆగస్టు,25

కావలి పట్టణంలోని ‘కలయిక’ కల్యాణ మండపంలో కీ.శే. ఇలింద్ర వరదరాజం గారి శత జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, కీ.శే. ఇలింద్ర వరదరాజం గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.​

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ — తమ తండ్రిగారి జ్ఞాపకార్థం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇలింద్ర వరదరాజం గారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. సమాజ సేవకు అంకితమై వారు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు.

​కార్యక్రమంలో భాగంగా, సమాజ సేవలో ముందుండే రోటరీ క్లబ్కు రూ. 1,00,000 (లక్ష రూపాయల) విరాళం చెక్కును ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా రోటరీ క్లబ్ ప్రతినిధులకు అందజేశారు.​ఈ కార్యక్రమంలో ఇలింద్ర వరదరాజం గారి కుటుంబ సభ్యులు, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు మరియు పలువురు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts