పెద్దపట్టపుపాలెం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా కాటంగారి రాములమ్మ ప్రకటించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

పెద్దపట్టపుపాలెం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా కాటంగారి రాములమ్మ ప్రకటించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 

ఎమ్మెల్యే గారి నివాసం వద్ద పండగ వాతావరణం..

​కావలి: శనివారం,23

కావలి రూరల్ మండలం పెదపట్టపుపాలెం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా కాటంగారి రాములమ్మ పేరును ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి  ప్రకటించారు. ఈ సందర్భంగా రాములమ్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మత్స్యకార నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఎమ్మెల్యే నివాసం వద్ద ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకార ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని మిఠాయిలు తినిపించుకుంటూ,సంబరాలు జరుపుకున్నారు.​ఎంపీటీసీ ఎన్నికల్లో రాములమ్మ ను భారీ మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి కానుక ఇస్తామని పార్టీ నాయకులు,మత్స్యకారులు ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు..


google+

linkedin

Popular Posts