కావలి నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్.. 24-10-2026

కావలి నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్..

టీడీపీలోకి పాముగుంటపాలెం వైకాపా కుటుంబాలు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి).

​​కావలి, ఆగస్టు:24

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కావలి రూరల్ మండలం, చెన్నాయిపాలెం పంచాయితీ పరిధిలోని పాముగుంటపాలెం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు..​

పాముగుంటపాలెం గ్రామానికి చెందిన దాదాపు 10 వైకాపా కుటుంబాలు ఆ పార్టీ విధానాలతో విసిగిపోయి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యాయి. 

ఈ నేపథ్యంలో వారు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో  వైకాపాను వీడుతున్నట్లు ప్రకటించి, టీడీపీలో చేరారు.  

​ఈ సందర్భంగా పార్టీలో చేరిన నూతన కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సాదరంగా పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన భరోసా ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts