సర్వాయపాలెం పంచాయతీ తాగేటివారిపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్యపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కావలి మండలం సర్వాయపాలెం పంచాయతీ తాగేటివారిపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్యపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

 చాట్ల వాసు కుటుంబ సభ్యులను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.

🔸 తన భర్తను దారుణంగా హత్య చేశారని కన్నీటి పర్యంతమైన చాట్ల వాసు భార్య.

🔸 చాట్ల వాసు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే.

🔸 బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.

🔸 ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి.

🔸 బాధిత కుటుంబానికి ఉద్యోగం సహా అవసరమైన ప్రభుత్వ సహాయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు.

🔸 "చాట్ల వాసు ఏం తప్పు చేశాడని ఇంత దారుణంగా హత్య చేశారు?"  ఎమ్మెల్యే 

🔸 "చాట్ల వాసును ఇంత దారుణంగా హత్య చేయడం నా మనసును కలచివేసింది" అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

🔸 "తాగేటివారిపాలెం అరుంధతివాడ ప్రశాంతతకు మారుపేరు. అలాంటి గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం అత్యంత బాధాకరం" 

🔸 మాజీ సర్పంచ్, వైసీపీ రూరల్ మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంద మధు సుఫారీ గ్యాంగ్‌తో ఈ దారుణానికి పాల్పడటం దారుణం..ఎమ్మెల్యే 

🔸 వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, గ్రామస్థాయి నాయకుల ఆలోచనా విధానం ఒకేలా ఉందని ఎమ్మెల్యే విమర్శించారు.

🔸 మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి  రాజకీయంగా ఎదుర్కోలేక హత్య రాజకీయాలకు తెరతీస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

🔸 "ఇకపై టీడీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు" అని ఎమ్మెల్యే హెచ్చరించారు.

🔸 "రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక మా నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు"

🔸 "మా నాయకుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోను" మేమేంటో చూపిస్తాం..

🔸 "ప్రతాప్‌రెడ్డి... రాజకీయంగా నేను అడ్డుగా ఉంటే నన్ను చంపేయండి... మా నాయకుల జోలికి వస్తే సహించను" ఎమ్మెల్యే

🔸 "ఒక అరగల కృష్ణయ్య, ఒక చాట్ల వాసు...ఇకపై చూస్తూ ఊరుకోం" ఎమ్మెల్యే 

🔸 వైసిపి పార్టీ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే రాజకీయాలను ప్రజలంతా ఖండించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

🔸 కావలి నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

🔸 వైసిపి పార్టీ గ్రామాల్లో వర్గ విభేదాలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

🔸 హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

🔸 ప్రజలను భయపెట్టే సంస్కృతికి తావివ్వబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

🔸 బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

🔸 నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

🔸 కావలి ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు.

🔸 చాట్ల వాసు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

google+

linkedin

Popular Posts