జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన కావలి ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ ఎస్ డీసీ ఆధ్వర్యంలో ఈనెల 31 వ తేదీన కావలి పట్టణంలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీ నందు నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మంగళవారం కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇందులో సుమారుగా 23 కంపెనీలు పాల్గొని సుమారుగా 1200 మందిని నియమించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కావలి నియోజకవర్గం లోని నిరుద్యోగ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, పాలిటెక్నిక్ మరియు బీఫార్మసీ చేసిన నిరుద్యోగ్యవతి యువకులు పాల్గొనవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా ఇంచార్జి అబ్దుల్ ఖయూమ్, తదితరులు పాల్గొన్నారు