కావలి 20వ వార్డు టీడీపీ ఇంచార్జ్ చెన్నంశెట్టి పెంచలయ్యకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాళి..
కావలి,జూన్:29
కావలి పట్టణం 20వ వార్డు కచ్చేరిమిట్ట ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,20వ వార్డు టీడీపి ఇంచార్జ్ చెన్నంశెట్టి పెంచలయ్య మృతిపట్ల కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, పెంచలయ్య భౌతికకాయానికి పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను భౌతికకాయంపై కప్పి పార్టీ తరఫున చివరి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పెంచలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, చెన్నంశెట్టి పెంచలయ్య తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, ప్రజలతో కలిసిమెలిసి పనిచేసే తత్వం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.పెంచలయ్య మరణం పార్టీకి, ముఖ్యంగా కావలి పట్టణం 20వ వార్డు తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని చెన్నంశెట్టి పెంచలయ్యకు అశ్రునివాళులు అర్పించారు..