కావలి పట్టణం 20వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

కావలి పట్టణం 20వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు జయంతి బాబు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రజలకు చేరువయ్యే గొప్ప అవకాశం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

45 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు, పెన్షన్లు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త ప్రకటించనున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావలిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

కూటమి నాయకులు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారని, వారి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ప్రతి పేద కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కావలి ప్రశాంతతకు మారుపేరని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

సమస్య లేకుండా టిడిపి కార్యకర్తలు నడుం బిగించారు

- సమస్యను తెలియజేసి లబ్ధి పొందండి

- ఫించన్ రానివారికి న్యాయం చేస్తారు 

- కార్యకర్తలకు తెలియజేసి సాయం పొందండి

- ఇంటింటి ప్రచారం లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 

కావలి, జులై 27,

నియోజకవర్గంలోని ఏ ఒక్క పేదరికంలో ఉన్న కుటుంబం కూడ ప్రభుత్వ పథకాలకు నోచుకోకుండా ఉండరాదని తమ టిడిపి కార్యకర్తలు నడుం బిగించి ఉన్నారని, మీకు ఏ సమస్య ఉన్నా వారికి తెలియజేసి లబ్ధి పొందాలని కావలి నియోజకవర్గం శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు.సోమవారం

కావలి పట్టణం 20వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు మండవ జయంతి బాబు, అధికారులు, టీడీపీ నాయకులు,కార్యకర్తలు, క్లస్టర్,యూనిట్ ఇన్‌చార్జిలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించి, ప్రజలు పొందుతున్న లబ్ధిని గుర్తు చేస్తూ, ఇంకా ఎవరైతే లబ్ధి పొందలేక వెనుకబడ్డారో వారిని గుర్తించి సహాయం చేయడం జరుగుతుందన్నారు.అందుకు గాను తమ టిడిపి కార్యకర్తలు నడుం బిగించి మీ ఇంటికి వస్తున్నారని తెలియజేశారు. 

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రజలకు చేరువయ్యే గొప్ప అవకాశం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేటి నుంచి 40 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు, కాలనీలు, పెన్షన్లు రానివారికి  అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త ప్రకటించనున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావలి ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కూటమి నాయకులు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారని, వారి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి పేద కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం అని అందుకు తమ కార్యకర్తలు మీకు సహకరిస్తారని అన్నారు.కావలి ప్రశాంతతకు మారుపేరని,అందరూ కలిసికట్టుగా పనిచేసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అనే కార్యక్రమంలో టిడిపి, కూటమి నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు,మూడో క్లస్టర్ కన్వీనర్ గుంటుపల్లి రాజకుమార్ చౌదరి,పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం, నెల్లూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి సింగంశెట్టి పద్మావతి శ్రీదేవి, టిడిపి సీనియర్ నాయకులు,పాలడుగు మురళి,రెండో క్లస్టర్ ఇంచార్జ్ తిరువీధి ప్రసాద్, యూనిట్ కో కన్వీనర్ రాయపాటి దిలీప్ కుమార్, పట్టణ యువత అధ్యక్షుడు కావేటి శివ,24వ వార్డు అధ్యక్షులు కావేటి చినకోటయ్య,యూనిట్ కన్వీనర్ ఉప్పుటూరి బాల గురుస్వామి, కావలి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు దావులూరి దేవకుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఏగూరి చంద్రశేఖర్, 26వ వార్డు గంగినేని వెంకటేశ్వర్లు,టిడిపి నాయకులు అమరా యాదగిరి గుప్త, నియోజకవర్గ ఐ టి డి పి  అధ్యక్షుడు కళ్యాణ్ చక్రవర్తి,వల్లేరి కిరణ్,20వ వార్డు ఉపాధ్యక్షుడు బాషా,89వ బూత్ కో-కన్వీనర్ ఆవులమంద శ్రీనివాసులు,90వ బూత్ కన్వీనర్ ప్రభు చరణ్,టీడీపీ నాయకులు,కార్యకర్తలు, క్లస్టర్,యూనిట్ ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు..


google+

linkedin

Popular Posts