కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ డా. పాదర్తి నాగరాజు

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ డా. పాదర్తి నాగరాజు

కావలి, జూలై 23: 

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సహకారంతో నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్‌గా డా. పాదర్తి నాగరాజు నియమితులైన సందర్భంగా గురువారం ఆయన తన మిత్రబృందంతో కలిసి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డా. పాదర్తి నాగరాజుతో పాటు ఆర్యవైశ్య సంఘానికి చెందిన ప్రముఖులు, పెద్దలు, యువ నాయకులు కలిసి ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు సముచిత గుర్తింపు కల్పించడంలో, సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సహకారం ఎంతో విలువైనదని వారు పేర్కొన్నారు.డా. పాదర్తి నాగరాజు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించేందుకు సహకరించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవికి తగిన విధంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ, రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.అనంతరం డా. పాదర్తి నాగరాజును ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తూ, సమాజానికి మరింత ఉపయోగపడేలా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యంగా తమ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి వివిధ రంగాల్లో గుర్తింపు, అవకాశాలు కల్పిస్తూ ఆత్మీయతతో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారేనని కొనియాడారు. ఎప్పటికప్పుడు తమ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


google+

linkedin

Popular Posts