కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న కావలి అభివృద్ధి

కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న కావలి అభివృద్ధి..

రూ.1.30 కోట్లతో కావలి పట్టణం వెంకటేశ్వర హాల్ నుంచి కలుగోళమ్మ దేవస్థానం వరకు సీసీ రోడ్లు, కెనాల్‌పై స్లాబ్ నిర్మాణ పనులు శరవేగం..

అభివృద్ధి పనులను అధికారులు,పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన  ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

కావలి, జూలై 30

కావలి పట్టణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో పలు కీలక అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా పూర్తవుతున్నాయి. పట్టణ రూపురేఖలను మార్చే విధంగా రహదారులు,డ్రైనేజీలు, కెనాల్‌ల అభివృద్ధి, పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులు ప్రాధాన్యతతో చేపట్టడం స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోంది. రూ.1.30 కోట్ల వ్యయంతో కావలి పట్టణం వెంకటేశ్వర హాల్ నుంచి కలుగోళమ్మ దేవస్థానం వరకు సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు కెనాల్‌పై స్లాబ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.గురువారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంబంధిత శాఖ అధికారులతో పాటు పార్టీ నాయకులతో కలిసి పనులను స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.పనులు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా అత్యుత్తమ ప్రమాణాలతో పూర్తి చేయాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. నిర్మాణంలో ఉపయోగిస్తున్న సామగ్రి నాణ్యత, పనుల వేగం, భద్రతా ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించి పలు సూచనలు చేశారు. అవసరమైన చోట సాంకేతిక మార్పులు చేయాలని అధికారులు సూచిస్తూ పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆ దిశగా కావలి నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని, పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.కావలి పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ప్రజా ఉపయోగకరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.

"కావలి అభివృద్ధే మా లక్ష్యం – ప్రజల సంక్షేమమే మా ధ్యేయం" అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలు విశేషంగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందని, వరుసగా అభివృద్ధి పనులు ప్రారంభం కావడం సంతోషకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు,సంబంధిత శాఖల అధికారులు,వార్డు ఇన్చార్జులు,  నాయకులు,తదితరులు పాల్గొన్నారు.



























google+

linkedin

Popular Posts