లేకల శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘన నివాళి

 లేకల శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘన నివాళి

కావలి, జూలై:30

కావలి పట్టణం జనతాపేటలో

 ఇటీవల మృతి చెందిన లేకల శ్రీనివాసరావు గారి పెద్దకర్మ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే  కావ్య కృష్ణారెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దివంగత శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ వారికి తన మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని లేకల శ్రీనివాసరావు గారి సేవలను స్మరించుకుంటూ అశ్రునివాళులు అర్పించారు.




google+

linkedin

Popular Posts