శారీరక దారుడ్యానికి, మానసిక వికాసానికి క్రీడలు అవసరం - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

 శారీరక దారుడ్యానికి, మానసిక వికాసానికి క్రీడలు అవసరం 

- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి 

శారీరక దారుడ్యానికి, మానసిక వికాసానికి క్రీడలు అవసరమని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. సోమవారం కావలి పట్టణంలోని పుల్లారెడ్డి నగర్ లో ప్రైమో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 20 టీములు పాల్గొనగా, ఏ టీం తో ఏ టీం పోటీ పడాలో ఆయన డ్రా తీశారు. బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని, ఓడిన వారు చింతించవలసిన అవసరం లేదన్నారు. తరువాత సాధించబోయే విజయానికి ఈ ఓటమి నాంది అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరివీధి ప్రసాద్, దేవరకొండ శ్రీను, భోగ్యం కిషోర్ కుమార్ రెడ్డి, కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, కావలి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు,  జనసేన కావలి పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.



google+

linkedin