రూ. 5 లక్షల ప్రమాద భీమా ఆర్ధిక సహాయం అందజేత

 రూ. 5 లక్షల ప్రమాద భీమా ఆర్ధిక సహాయం అందజేత

కావలి పట్టణం ముసునూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉప్పు గోపాల్ ఇటీవల ప్రమాదంలో మరణించాడు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి సూచనలతో తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ గారు ప్రమాద భీమా రూ. 5 లక్షలను గోపాల్ సతీమణి రమాదేవి కి పంపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వచ్చిన లేఖలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉండటం వలన గోపాల్ కుటుంబానికి ప్రమాద భీమా రూ. 5 లక్షలు రావడం జరిగిందని, ఆ కుటుంబం ఆత్మ స్థైర్యంతో నిలబడేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.






google+

linkedin