పలు కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
నెల్లూరు జిల్లా...కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామానికి చెందిన పాలపర్తి భాస్కర్ రావు-కోమలి గార్ల కుమార్తె జోష్ట నలుగు కార్యక్రమం గురువారం రుద్రకోటలో వారి స్వగృహం నందు జరిగింది..ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు..కావలి పట్టణం 9వ వార్డు అరటితోట లో టిడిపి పార్టీకి చెందిన పసుపులేటి కృష్ణ- పద్మావతి గార్ల కుమారుడు వెంకటరమణ నలుగు కార్యక్రమం గురువారం వారి స్వగృహం నందు జరిగింది..ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు..కావలి రూరల్ మండలం.. చెన్నాయిపాలెం (పెద్దపట్టపుపాలెం) గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త,పామంజి పార్వతయ్య - శ్రీమతి వనజ గార్ల కుమార్తె పుష్పలంకరణ,వేడుకలు గురువారం రాత్రి జరిగాయి.ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు హాజరై చిన్నారిని,ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..