నీటి సంఘం అధ్యక్షులు పిలిమిట్లకు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

 నీటి సంఘం అధ్యక్షులు పిలిమిట్లకు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

మద్దూరుపాడు చెరువు నీటి సంఘం అధ్యక్షులు పిలిమిట్ల వెంకటేశ్వర్లు ఉత్తర క్రియల కార్యక్రమం కావలి పట్టణంలోని మద్దూరుపాడులోని వారి నివాసంలోబుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొని వెంకటేశ్వర్లు చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, కొండా వెంకట్రావు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





google+

linkedin