పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 18-08-2025
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్లూరు మండలం బోడిసత్రం కు చెందిన ఈగ శ్రీనివాసులు - శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు క్రిష్ణ వివాహం ఆదివారం రాత్రి జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన లేకపోయిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. దగదర్తి మండలం బోడగుడిపాడు కు చెందిన బత్తల హజరత్తయ్య - లోక సుందరమ్మ దంపతుల కుమారుడు అభినాష్ యాదవ్ వివాహం ఆదివారం వారి నివాసంలో జరిగింది.
ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన లేకపోయిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కావలి పట్టణం ముసునూరు బాలాజీ నగర్ కు చెందిన పాలిచర్ల మస్తాన్ రెడ్డి- సుప్రజ దంపతుల కుమార్తె శరణ్య వివాహ కార్యక్రమం బృందావనం కాలనీలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కావలి పట్టణానికి చెందిన నేరెళ్ల వెంకటేష్ - మధులత దంపతుల కుమార్తె సత్య హర్షిత - ఓణిల కార్యక్రమం, కుమారుడు సత్య ఈక్షిత్ పంచె కట్టు కార్యక్రమం ఎస్ఎంకే కన్వెన్షన్ లో ఆదివారం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.. కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామానికి చెందిన ఉదయగిరి శివరావు- మల్లేశ్వరి కుమారుడు సత్యానంద వివాహ కార్యక్రమం గౌరవరం గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామానికి చెందిన నిమ్మల దామోదర్ - రమాదేవి దంపతుల కుమార్తె జయశ్రీ వివాహ రిసెప్షన్ గౌరవరం గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి పట్టణం అరటి తోటకు చెందిన మునగాల నాగిరెడ్డి- హజరత్తమ్మ దంపతుల కుమారుడు మధన్ వివాహం ముసునూరులోని ఎంకేఆర్ కన్వెన్షన్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. కావలి పట్టణం వెంగళరావు నగర్ కొత్త శివాలయం వీధికి చెందిన పబ్బిశెట్టి వెంకట ప్రసాద్ రావు - రత్నకుమారి దంపతుల కుమార్తె వెంకట రాధాకుమారి వివాహ కార్యక్రమం జమ్మలపాలెంలోని కె.వి.ఆర్ కన్వెన్షన్ లో ఆదివారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.