పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 10-08-2025

 పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 10-05-2025

 కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం రాత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దగదర్తి మండలం ఉలవపాళ్ళకు చెందిన పోలిశెట్టి శ్రీనివాసులు - హరిత దంపతుల కుమార్తె ప్రీతి రిసెప్షన్ కార్యక్రమం జమ్మలపాలెం లోని కేవిఆర్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారం కు చెందిన గొట్టిపాటి జస్మిత, గీతిక ల ఓణీల కార్యక్రమం జమ్మలపాలెం లోని ఎస్ విఆర్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.


కావలి పట్టణం పెంకుల ఫ్యాక్టరీ కి చెందిన మొద్దు శ్రీనివాసులు- రమణమ్మ దంపతుల కుమార్తె సంధ్యారాణి వివాహ రిసెప్షన్ కార్యక్రమం కావలి పట్టణంలోని రామిరెడ్డి తోట కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కావలి పట్టణం చింతం వారి వీధికి చెందిన చవల ప్రసాద్ - ఉషారాణి దంపతుల కుమార్తె పోలాక్షి వివాహ రిసెప్షన్ కార్యక్రమం కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

google+

linkedin