37 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి నియోజకవర్గంలో వివిధ వ్యాధుల చికిత్సల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భారీ స్థాయిలో సహాయం అందిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు.శుక్రవారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు రూ. 26,18,395 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుండి వచ్చిన 1125 అప్లికేషన్లలో 796 మందికి రూ. 6,85,24,977 విలువైన చెక్కులను పంపిణీ చేశాం. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో రాష్ట్రంలోనే కావలి ప్రథమ స్థానంలో నిలిచింది” అని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య సహాయంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కావలి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
“రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా, సీఎం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నారు” అని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.త్వరలో కావలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్ట బోతున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు.“కొత్త రోడ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి..కావలి నియోజకవర్గంలో రైతులు సంతోషంగా ఉన్నారు” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో,కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్,ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు,కావలి రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ,బోగోలు మండలం అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, దగదర్తి మండలం అధ్యక్షులు అల్లం హనుమంతరావు,టిడిపి సీనియర్ నాయకులు పొట్లూరి శ్రీనివాసులు,పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం , నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ అలహర్,జనసేన పట్టణ అధ్యక్షులు బొబ్బ సాయి,ఏగూరి చంద్రశేఖర్,శానం హరి,దావులూరి దేవ కుమార్, కావలి రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకట్రావు,వల్లేరి కిరణ్ కుమార్ ,అక్కలిగుంట సూర్యప్రకాష్ ,తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






