నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు
నెల్లూరు జిల్లా,కావలి-డిసెంబర్-09-12-25
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మంగళవారం నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ సంతోషకరమైన కుటుంబ వేడుకలో పాల్గొన్నారు.
పసుపర్తి శంకరం (లేట్), శ్రీమతి కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు శివకుమార్ వివాహం కావలి మండలం సర్వాయపాలెం పంచాయితీ–త్యాగేటివారి పాలెం గ్రామంలోని వారి స్వగృహంలో సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది.
వివాహ వేడుకకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చేరుకోగానే కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, అభిమానులు హర్షోత్సాహాలతో స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులకు ఆశీర్వచనాలు అందించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని విశేషంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు స్థానిక గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...





