నెల్లూరులో గ్రంథాలయ సంస్థల చైర్మన్ ప్రమాణస్వీకారం..
మేకపాటి శాంతి కుమారిని అభినందించిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి..
నెల్లూరు జిల్లా, ఫిబ్రవరి-01
నెల్లూరు నగరంలోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థల చైర్మన్‌గా మేకపాటి శాంతి కుమారి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు...ఈ కార్యక్రమంలో ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర,రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వర రావు ,ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,తిరుపతి పార్లమెంట్ అధ్యక్షరాలు పనబాక లక్ష్మి, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి , బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి, పనబాక భూలక్ష్మి, లతో కలిసి పాల్గొన్న వివిధ పదవుల్లో ఉన్న టిడిపి నాయకులు అధికారులు తో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేకపాటి శాంతి కుమారి గారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ,గ్రంథాలయ వ్యవస్థ సమాజానికి మేధోబలం అందించే కీలక కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు, యువత, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయాలు దిక్సూచిలా మారాలని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా వ్యక్తిత్వ వికాసం, విజ్ఞాన విస్తరణ జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మేకపాటి శాంతి కుమారి గారు తన పదవికి వన్నె తీసుకువచ్చే విధంగా పనిచేయాలని, గ్రంథాలయాల అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆకాంక్షించారు.గ్రంథాలయాలను ఆధునీకరించి,ప్రజలకు మరింత చేరువ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ అధికారులు,ప్రజాప్రతినిధులు,మేధావులు,వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...