శ్రీ భగవద్గీత మందిరం 56వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి పట్టణం రైల్వే రోడ్డులో ఉన్న గీత మందిరంలో శ్రీ భగవద్గీత మందిరం 56వ వార్షికోత్సవ మహోత్సవం సోమవారం భక్తి శ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. ఉదయం నుండి మందిర ప్రాంగణం మంత్రోచ్చారణలు, భజనల నినాదాలతో మార్మోగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమానికి చేరుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి కమిటీ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించగా భక్తులు హర్షాతిరేకంతో స్వాగతం తెలిపారు.ఎమ్మెల్యే గారు గీతా పీఠంలో స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ—“కావలి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖశాంతులతో,ఆరోగ్యసంపదలతో ఉండాలని శ్రీ భగవద్గీత స్వామి వారి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను” అని ఆభక్తితో చెప్పారు.పూజ సమయంలో గీతా శ్లోకాల నాదం, దీపారాధన, భక్తుల భక్తి పరవశం ఆధ్యాత్మికతను మరింత పెంచాయి.కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తజనం పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను జాజ్వల్యంగా మార్చారు.













