కావలిలో డివిజిటల్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
పరిపాలన సౌలభ్యం కోసం కావలిలో తాత్కాలిక డివిజనల్ అభివృద్ధి కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
పది మండలాల అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఈ కార్యాలయం ద్వారానే జరుగుతుంది..ఎమ్మెల్యే
కావలిలో నూతన కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరైందని, ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
కావలిలో పరిపాలన సౌలభ్యం కోసమే తాత్కాలిక డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం 30వ వార్డులోని మున్సిపల్ కార్యాలయం పక్కన గురువారం డిఎల్డిఏ (డివిజనల్ లెవల్ డవలప్మెంట్ ఆఫీస్) కార్యాలయాన్ని అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రారంభించారు...ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారిని వార్డు నాయకులు,అధికారులు ఘనంగా స్వాగతం పలికారు... అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డవలప్మెంట్ అధికారి కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ––
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు, నిధులను వేగంగా మంజూరు చేయడానికి ఈ కొత్త డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కావలిలో నూతన భవన నిర్మాణానికి కావలసిన స్థలం కూడా కేటాయించామని చెప్పారు...ఇకపై మండల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం జిల్లా సీఈఓ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, కావలి కేంద్రంగా పది మండలాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ కార్యాలయం ద్వారానే పర్యవేక్షించబడతాయని వివరించారు. కొత్త కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 2 కోట్లు 50 లక్షలు ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు..ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కావలి ఆర్డిఓ వంశీకృష్ణ,మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్,DDO విజయ్ కుమార్,కావలి ఎంపీడీవో శ్రీదేవి, పలు శాఖల అధికారులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు..











