ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్, హిమాన్షు శుక్లా,..
సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ దిగిన జిల్లా కలెక్టర్, కావలి ఎమ్మెల్యే..
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ‘ఐ లవ్ కావలి’ ఐకాన్ సెంటర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో కలిసి సందర్శించారు.కావలి పట్టణం నడిబొడ్డున ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ సెంటర్‌ను పరిశీలించారు.గ్యాలరీలో ఏర్పాటు చేసిన దేశభక్తి నాయకుల చిత్రపటాలు, కావలి మాజీ ఎమ్మెల్యేల ఫోటో గ్యాలరీ, అలాగే 100 అడుగుల జాతీయ జెండాను వీక్షించారు. ఐకాన్ సెంటర్ ప్రత్యేకతలను, ఆకర్షణీయంగా రూపొందించిన డిజైన్‌ను ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి సెల్ఫీ దిగారు. “కావలి ప్రజల హృదయంలో అందంగా, దేశభక్తి భావాలకు నాంది పలికే విధంగా ఈ ఐకాన్ సెంటర్ ఏర్పాటు చేయడం నిజంగా అద్భుతం” అని కావలి ప్రజలకు గర్వకారణంగా నిలుస్తున్న ఈ ఐకాన్ సెంటర్ ఉందని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభినందించారు.







