విద్యతోనే ఉజ్వల భవిష్యత్తును అందుకోగలరని కలెక్టర్ హిమాన్ శుక్ల తెలియజేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోరిక మేరకు పాఠశాల అభివృద్ధి కోసం పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
వాయిస్. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్18వ వార్డు లో ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ హిమాన్స్ శుక్లా , ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు .ముందుగా విద్యార్థులు పాఠశాల గురించి ,సమస్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు ,పారిశ్రామికరణకు ఎంతో ప్రాధాన్పిస్తుందని చెప్పారు .కష్టపడి చదవటం నేర్చుకోవాలన్నారు. కష్టాలు ,అనేక ఇబ్బందులు వస్తాయని తెలియజేశారు. అలాంటప్పుడే ధైర్యంగా నిలబడాలన్నారు. సమాజంలో మీరు ఉన్నత స్థితి రాగలినప్పుడే మీ తల్లిదండ్రులకు గౌరవం ఉంటుందని సూచించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా 10 లక్షలు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆయన పారిశ్రామికీకరణకు ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ నేడు ఆధునికంగా ముందుకి వెళ్తుంది అన్నారు .సెల్ఫోన్లో విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. అలాంటి సమయంలో వారితో ఎంతో ఉన్నతమైన ఫ్రెండ్లీగా తల్లిదండ్రులు ఉండాలి అన్నారు. పిల్లల గురించి తల్లిదండ్రులు ఆరా తీయాలన్నారు. ప్రభుత్వం అనేక లక్షలు ఖర్చుచేసి మీకు చదువుని అందిస్తుంది అన్నారు .కార్యక్రమంలో RDO వంశీకృష్ణ ,మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి ఎమ్మార్వో శ్రావణ కుమార్,కావలి జనసేన పార్టీ ఇన్చార్జి అలహరి సుధాకర్,కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కావలి జనసేన పట్టణ అధ్యక్షులు బొబ్బ సాయి తెలుగుదేశం పార్టీ 18వ వార్డు ఇంచార్జ్ శానం హరి , టిడిపి సీనియర్ నాయకులు ఏగూరి చంద్రశేఖర్ ,మొగిలి కల్లయ్య, గంగినేని వెంకటేశ్వర్లు నాయుడు ,తదితరులు పాల్గొన్నారు.





















