జోరు వానలోనూ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 01-12-2025

జోరు వానలోనూ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

గిరిజన కాలనీలో సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు

దగదర్తి లో ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం.

నెల్లూరు జిల్లా – బోగోలు మండలం – మంగమూరు గ్రామం.

ఎన్‌టీఆర్,సామాజిక భద్రతా పథకం కింద లబ్ధిదారులకు అందించే పింఛన్లను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సోమవారం స్వయంగా గ్రామాల్లో తిరిగి అందజేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం మంగమూరు గిరిజన కాలనీలో జోరు వర్షం కురుస్తున్నా ప్రజల కోసం నేరుగా వారి ఇళ్లకి వెళ్లి పింఛన్లు అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది..వర్షం తెరలు విరజిమ్ముతున్నా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రాతిపదికన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నూతన వితంతు పెన్షన్ నగదు అందజేసిన ఎమ్మెల్యే,అదే సమయంలో వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరిస్థితులను కూడా వివరంగా అడిగి తెలుసుకున్నారు.గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, “పెద్దలు ఇంట్లో ఉన్నారు కాబట్టి మనం వాళ్ల వద్దకే వెళ్లాలి అన్న భావనతో ఒక్కొక్కరినీ పరామర్శించారు. ఈ సందర్శనలో ముంగమూరు గిరిజన కాలనీలో కొంతమందికి పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ బిల్లుల సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే హౌసింగ్ ఏఈకు ఫోన్ చేసి రెండు రోజులలోనే గృహాలను ఫీల్డ్‌లో పరిశీలించి బిల్లులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ—“రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు నిరాటంకంగా అందజేస్తున్నాం” అని తెలిపారు.కావలి నియోజకవర్గంలో ఒక్క నెలలోనే 15కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేసినట్లు వివరించారు. కొత్తగా కావలి నియోజక వర్గంలో 78 మందికి వితంతు పెన్షన్ వచ్చాయని.. పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రంలోని ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సమాజం మొత్తానికి రక్షణ కవచంగా మారుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు,మంత్రి నారా లోకేష్ గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టపోతున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు..రాష్ట్రంలో ఇంకా దాదాపు 8 లక్షల మంది అవసరం ఉన్న వారికి సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవం, దూరదృష్టితో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఎమ్మేల్యే అన్నారు..“ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వారి అవసరాలకు అనుగుణంగా అడుగు తప్పని విధంగా మంచి పథకాలు రూపొందిస్తూ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని  ఏ కష్టం వచ్చినా జోరు వానలోనూ ప్రజల మధ్యకు వెళ్లి, వారి ఇళ్లకే చేరుకుని, సమస్యలు వినడం—పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగమూరు గ్రామంలో విశేషంగా నిలిపింది. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేల సేవా భావాన్ని అభినందించారు..బోగోలు మండలం టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు,నాగులవరం సింగల్ విండో ప్రెసిడెంట్ చిలకపాటి వెంకటేశ్వర్లు,సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట్ల మధుబాబు నాయుడు,మండల ప్రధాన కార్యదర్శి లేలపల్లి సుధీర్, పుంగనూరు టిడిపి సీనియర్ నాయకులు ఎన్నబత్తిన వెంకటేశ్వర్లు,కోడూరు వెంకటేశ్వర్లు రెడ్డి, సచివాలయం సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts