మబ్బుల్ జాన్ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

 మబ్బుల్ జాన్ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

 మస్తాన్ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే..

 కావలి,ఫిబ్రవరి- 01

టిడిపి సీనియర్ నేత, మాజీ కౌన్సిలర్ షేక్ మస్తాన్ భార్య మబ్బుల్ జాన్ పెద్ద కర్మ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని AVS కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు హాజరై, మస్తాన్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మస్తాన్‌కు ఎమ్మెల్యే గారు ధైర్యం చెప్పి, ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.దుఃఖంలో ఉన్న కుటుంబానికి మాటలతోనే కాకుండా ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరై మానసిక స్థైర్యం కల్పించారు.కార్యక్రమం అనంతరం మస్తాన్‌తో కలిసి కొద్దిసేపు ముట్టడించి,మస్తాన్ ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వీకరించారు.ఈ ఆత్మీయత, సానుభూతితో కూడిన చర్య మస్తాన్‌ను భావోద్వేగానికి గురి చేసి ఆనందపరిచింది.ప్రజా నాయకుడిగా మాత్రమే కాకుండా, మనిషిగా కూడా దగ్గరగా నిలిచే నాయకుడు కావ్య కృష్ణారెడ్డి అని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. దుఃఖ సమయంలోనూ ప్రజల మధ్య ఉండే ఆయన స్వభావం మరోసారి స్పష్టమైంది.






google+

linkedin

Popular Posts