కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి కుమార్తె సంహిత రెడ్డి–ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు..
కొండ బిట్రగుంట, ఫిబ్రవరి-26
నెల్లూరు జిల్లా,బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్ కాంతులతో ప్రకాశిల్లుతూ, భక్తుల రద్దీతో కళకళలాడింది.ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి కుమార్తె సంహిత రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె స్వామివారిని ప్రార్థించారు.బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఆలయ నిర్వాహకులను ఆమె అభినందించారు.శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు “గోవిందా… గోవిందా…” నామస్మరణలతో మారుమోగాయి.ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సంహిత రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, కొండ బిట్రగుంటలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు విశేషమైన ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ, అధికారులు, సేవా సిబ్బందిని అభినందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం అభినందనీయం అన్నారు..ఉత్సవాల కాలంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పారు.భక్తి, ఆధ్యాత్మికత, ఆనందోత్సాహాలతో కొండ బిట్రగుంటలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.