గ్లోబల్ స్కూల్ నూతన భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే
కావలి పట్టణం ముసునూరులోని గ్లోబల్ స్కూల్ నూతన భవనాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్కూల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. విలువలతో కూడిన విద్యను అందించాలని స్కూల్ కరస్పాండెంట్ సాధనాల దామోదర్ నాయుడుకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.