నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి 26-03-2026

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి 26-03-2026

- శ్రీధర్ రెడ్డి స్పీడ్‌ను మేము అందుకోలేము 

- ఒకరికి ఓటు వేస్తే ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తున్న పరిస్థితి ప్రత్యేకం

- చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామిక ప్రగతి దిశగా దూసుకుపోతుంది

- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి 

- నెల్లూరు రూరల్‌లో రూ.1.51 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం 

 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ కల్లూరుపల్లి ప్రాంతంలో రూ.1.51 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని గజమాల తో సత్కరించి స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శిష్యుడినేనని, ఆయన చూపుతున్న అభివృద్ధి వేగాన్ని తాము అందుకోవడం కష్టమేనని అన్నారు. రాజకీయాల్లో స్పష్టత, నిజాయితీతో ముందుకు నడిపించే నాయకత్వం ఆయనలో కనిపిస్తుందన్నారు. ఏ సమస్య వచ్చినా సలహా కోసం ఆశ్రయించేది శ్రీధర్ రెడ్డి ఒక్కరినేనని తెలిపారు. నెల్లూరు రూరల్ ప్రజలు ఒకరికి ఓటు వేస్తే ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తున్న పరిస్థితి ప్రత్యేకమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజల మధ్య ఉండటం నాయకుడి బాధ్యత అని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకత్వం లభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. రాజకీయాల్లో సాధారణంగా కనిపించే విభేదాలకు భిన్నంగా కోటంరెడ్డి సోదరులు చూపుతున్న సహకారభావం ఆదర్శప్రాయమని కొనియాడారు.

ఒక నాయకుడు మరొక నాయకుడిని ఆహ్వానించడం పెద్ద మనసుకు నిదర్శనమని చెప్పారు. వారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామిక ప్రగతి దిశగా దూసుకుపోతుందని అన్నారు. పరిశ్రమలు విస్తరించడంతో యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జెన్ని రమణయ్య, కార్పొరేటర్ ఆరవ శాంతి, టిడిపి ఎస్‌సి సెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, మాతంగి కృష్ణ, కార్పొరేటర్లు భీమినేని మురహరి, బద్దెపూడి నరసింహగిరి, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, ఇతర పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts