సత్యవతి భౌతికయానికి నివాళులర్పించిన.. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
కావలి,బుధవారం:20
కావలి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది కీ.శే. యం.వి.నారాయణ గారి సతీమణి శ్రీమతి మువ్వల సత్యవతి మంగళవారం మృతి చెందారు విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి పట్టణంలోని వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే సత్యవతి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా సత్యవతి గారి సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కావాలి అంటే పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, స్థానిక నాయకులు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.