హజరత్ సయ్యద్ ఫక్రుద్దీన్ బాబా గంధ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
కావలి, జూన్ 8:
కావలి పట్టణంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న హజరత్ సయ్యద్ ఫక్రుద్దీన్ బాబా ఉరఫ్ పుట్టేషావలి పీర్ రహమతుల్లాహి అలైహి వారి గంధ మహోత్సవం సందర్భంగా సోమవారం దర్గా నిర్వాహకులు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో దర్గా నిర్వాహకులు గంధ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా గంధ మహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
గంధ మహోత్సవం విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, ఈ కార్యక్రమం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు.