కావలిలో 'మిస్టర్ చికెన్ అండ్ మటన్' నూతన షాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్, మసీదు కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన 'మిస్టర్ చికెన్ అండ్ మటన్' నూతన షాప్‌ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని అలహర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తన శిష్యుడు అలహర్ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. వ్యాపారంలో అభివృద్ధి సాధించి, భవిష్యత్తులో కావలి పట్టణంలో మరిన్ని బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు మరియు పలువురు ప్రజలు పాల్గొని అలహర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.