కావలి మండల MPTC అభ్యర్థులకు 'బి-ఫారాలు' అందజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి:ఆగస్టు,27
స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC) ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బి-ఫారాలను అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమ్మేళనంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు..