ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా అసోసియేషన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. వాహన ప్రమాద సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా హెల్మెట్లను అందజేశారు. అసోసియేషన్ సభ్యుల కుటుంబాల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మోమెంటోలు, గిఫ్టులు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం చూపాలని ఎమ్మెల్యే ను కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్ఞాపకాలను తమ కెమెరా లతో బంధించి పది కాలాల పాటు నిలిపేవారు ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు అని కొనియాడారు. వస్తున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని పెంచుకొని ఆకర్షణీయంగా ఫోటోలు, వీడియోలు తీసే విధంగా మార్పులు చెందాలని వారికి సూచించారు. అసోసియేషన్ కు అవసరమైన భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ఒక నెలలో చూపుతానని తెలిపారు. పార్టీలకుతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఉండాలని వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పి పి శ్రీధర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునందరావు, డాక్టర్ రామస్వామి, టిడిపి నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పొట్లూరి శ్రీనివాసులు, పోతుగంటి అలేఖ్య, తిరివీధి ప్రసాద్, జనసేన కావలి నియోజకవర్గం ఇంచార్జ్ అలహరి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు..