ప్రతి పధకాన్ని ప్రజలకు అందజేస్తాం
బలహీన వర్గాల అభివృద్ధి టీడీపీ అజెండా
ఒక సిద్ధాంతంతో నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ టీడీపీ
వైసీపీ అరాచకాలు తట్టుకోలేక టీడీపీలోకి పెరుగుతున్న వలసలు....
గత ఐదేళ్లు వైసీపీ పాలన దోచుకోవడం, దాచుకోవడమే
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
మినీ మహానాడుకు పోటెత్తిన తెలుగు తమ్ముళ్లు
ప్రతి పధకాన్ని ప్రజలకు చేరువ చేస్తూ, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఒక అజెండాతో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. సోమవారం కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కల్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నాయకులతో కలిసి మహానాడు లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవల కాలంలో మృతి చెందిన టీడీపీ కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు, నాయకులతో కలిసి పలు తీర్మానలకు ఆమోదం తెలిపారు. కావలి నియోజకవర్గంలో దామవరం విమానాశ్రయం, రామాయపట్నం పార్టు, బీపిసీయల్ కంపెనీ ను నిర్మిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. అలాగే బిట్రగుంటలో వందే భారత్ సర్వీస్ సెంటర్, మల్టి మోడల్ లాజిస్టిక్ పార్క్, కేంద్రీయ విద్యాలయం కావాలని నాయకులు తీర్మానించారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో చర్చించి త్వరలోనే అన్నీ వచ్చేలా ఏర్పాటు చేస్తానన్నారు. కావలి రూలర్ మండలానికి, అల్లూరుకు సంబందించి రాజుపాలెం నుంచి రామాయపట్నం పోర్టు వరకు అల్లూరు బైపాస్ తో జువ్వలదిన్నె ఫిషింగా హార్బర్ మీదగా జాతీయ రహదారి 4 లైన్లతో నిర్మాణానికి తీర్మానం చేశారు. కావలి పట్టణ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉదయగిరి రోడ్డు నుండి జాతీయ రహదారి వరకు పడమర వైపున బైపాస్ నిర్మాణానికి, కావలి పట్టణం తూర్పు, పడమరలను అనుసంధానం చేస్తూ రైల్వే అండర్ పాస్ లను నిర్మాణం చేయాలని, కావలి పట్టణంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు నిర్మాణం కోరుతూ, మినీ స్టేడియం ఏర్పాటు చేయలవలసినదిగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయవలసినదిగా తీర్మానాలు చేశారు. అలాగే గెలిచిన వెంటనే తుమ్మలపెంట రోడ్డు, చల్లంచర్ల రోడ్డు, దగదర్తి మండలంలో పలు రోడ్లు నిర్మించారన్నారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..