పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావలి పట్టణానికి చెందిన గుత్తి జనార్దన్, సునంద దంపతుల కుమారుడు ఈశ్వర్ రిషి వివాహం పట్టణంలోని ఎంజిఆర్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జలదంకి మండలం అన్నవరం కు చెందిన ముచ్చాల మనోహర్ రెడ్డి & విజయలక్ష్మి దంపతుల కుమార్తె ఆదీష వివాహం కావలి పట్టణంలోని కృష్ణం రాజేశ్వరమ్మ టౌన్ హాల్ జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కావలి పట్టణానికి చెందిన సొంగా కుమార్ మమత దంపతుల కుమారుడు శరత్ వివాహ వరలక్ష్మి వ్రత కార్యక్రమం బాపూజీ నగర్ లోని వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కావలి పట్టణానికి చెందిన లాకా శ్రీనివాసులు & శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె ఖ్యాతిశ్రీ ఓణీ ల కార్యక్రమం మరియు వారి కుమారుడు వెంకట్ ధన్మయ్ కుమార్ పంచె కట్టు కార్యక్రమం దొడ్ల మనోహర్ రెడ్డి కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కావలి పట్టణం 19వ వార్డుకు చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు షేక్ గౌస్ బాషా ఆదివారం అకాల మరణం చెందారు.
విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు 19వ వార్డులోని వారి నివాసానికి చేరుకుని గౌస్ బాషా పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..