ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి..! నారా లోకేష్ బాబు గారి గురించి అనుచితంగా మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తాం. లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. లోకేష్ బాబు గురించి మరోసారి తప్పుగా మాట్లాడితే కావలిలో నిన్ను అడుగుపెట్టనివ్వం. అవును నా కావలి అభివృద్ధికై ఎవరినైనా అడ్డుకుంటా.. రియల్టర్లు ఎవరో చేసిన తప్పుకు కొనుగోలుదారులు బలి కావాలా ?
- మనీ స్కాం సుభాని బాధితులకు త్వరలో డబ్బులు పంపిణీ
- ప్రశాంతమైన కావలిలో అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోను
- అభివృద్ధికి సహకరిస్తే మంచిది లేదంటే ఎంతటి వారినైనా అడ్డుకుంటా
- మాజీ ఎమ్మెల్యే పై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కౌంటర్
కావలి: మంగళవారం:09
అవును నా కావలి నియోజకవర్గం అభివృద్ధికై ఎవరైనా అడ్డుకుంటా అంటే చూస్తూ ఊరుకోమని, ఎవరో చేసిన తప్పుకు నేడు ప్లాట్లు పై విజిలెన్స్ దాడులతో కొనుగోలు దారులు బలి అవుతుంటే చూస్తూ ఊరు కోనని, ఎంతటి వారినైనా అడ్డుకొని ప్రజలకు న్యాయం చేస్తానని కావలి శాసనసభ్యులు డివికృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కావలి టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడిన తీరుపై ఎమ్మెల్యే ఘాటుగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు రెండువేల ఎకరాలు వెంచర్లు వేసి ఆ నాడు రియల్టర్ల నుండి కమిషన్లు పుచ్చుకున్న నాటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, వెంచర్లు వేసిన వారు అందరూ నేడు బాగున్నారు, కానీ విజిలెన్స్ తనిఖీల్లో భాగంగా ప్లాట్లు కొన్న మధ్యతరగతి, పేదవారు నష్టపోవాల్సిన అవసరం ఏముంది అని వారికి న్యాయం చేసే విధంగా నిలుస్తానని అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప కొనుగోలుదారులకు నష్టం జరిగితే అడ్డుకుంటానన్నారు. ఆనాడు రియల్టర్లకు సహకరించి కోట్ల రూపాయలు దండుకొని నేడు పెద్దమనిషిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ 126 ఎకరాలు సంగతి ఏమైంది అని ప్రశ్నిస్తున్నారే తప్ప ప్రజల స్థితిగతులపై ఏమాత్రం ఆలోచన లేని నాయకుడిగా ఉండటం కావలికి పట్టిన దౌర్భాగ్యం అని తెలిపారు.
పోతే మోసం చేసే దొంగలు ఏ ప్రాంతాల్లో మోసం చేయాలో వెతుక్కుంటూ వచ్చి ఆ ప్రాంతంలో ప్రజలను మోసం చేస్తారని, ఆ కోవకు చెందిన సుభాని అనే వ్యక్తి నాలుగు రాష్ట్రాలు దాటి వైసిపి ప్రభుత్వం లో కావలికి వచ్చి ఆనాటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియజేసి, అతని మనీ స్కాం ను కావలి ముసునూరులో ప్రారంభించి, ప్రజలను మోసం చేసిన వైనం తెలియదా అని ప్రశ్నించారు. అందులో పెద్దసంఖ్యలో పోలీసు , ఆయా ప్రభుత్వ అధికారులు, పేదలు ఉన్నారన్నారు. సుభాని ఇంటికి రోడ్డు వేసింది కూడా నీ ప్రభుత్వంలోనే వేయించావు కదా అని ప్రశ్నించారు. ఆ మని స్కీం బాధితులకు త్వరలోనే నగదు పంపిణీ కూడా చేయబోతున్నామని గుర్తు చేశారు. కావలి ప్రశాంతంగా ఉన్న ప్రాంతమని అట్టి కావాలని స్వార్ధపూరిత నీ రాజకీయాల కోసం అల్లర్లతో కూడిన అరాచకాలు సృష్టించాలని చూస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని, ఎంతటి వారినైనా క్షమించేది లేదని అన్నారు. కావలి నాది నా కావలిని నేను కాపాడుతూ అభివృద్ధి చేసి చూపుతానని సహకరించగలిగితే మంచిదని లేదంటే అరాచకాలు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఎదుర్కొని కావలి నుంచి తారమడం జరుగుతుందన్నారు. జూన్ 4వ తేదీకి ఎమ్మెల్యేగా తాను బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఎంతటి అభివృద్ధిని చేసి చూపాను అనేది కావలి ప్రజలు గమనిస్తున్నారన్నారు. నా మనస్సాక్షికి, నేను నమ్మిన దైవానికి, నాకు నచ్చిన టిడిపి పార్టీకి, ఫ్రెంట్ ఆలోచనలకు కావలి ప్రజల కు అనుగుణంగా పనిచేయటమే తన కర్తవ్యం అని తెలిపారు. కావలిలో ప్రతిపక్షము కనుమరుగైందన్న పరిస్థితిని తట్టుకోలేక సుభిక్షంగా ఉన్న ప్రజలను ఆటంకం కలిగించాలని భయభ్రాంతులకు గురిచేయాలని చూడడం వైసిపి నాయకులకు తగదన్నారు. అభివృద్ధికి సహకరించి సూచనలు చేయగలిగితే అభినందిస్తామన్నారు. ఇటీవల అమృత పథకం .2 ద్వారా 43 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నప్పుడు గతంలో జరిగిన అవినీతిని వెలికి తీసి చూపటం సహించుకోలేని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం దౌర్భాగ్యం అన్నారు.
అవినీతికి గుడ్డలు వేస్తే ఎలా ఉంటుందో ప్రతాప్ కుమార్ రెడ్డి ని చూస్తే తెలుస్తుందని ఎద్దేవ చేశారు. ఏదో తాగిన మత్తులో ఉంటూ ప్రతాప్ కుమార్ రెడ్డి, తన అనుచరులు రంకెలు వేస్తూ అర్థం లేని మాటలతో రెచ్చిపోవడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతాప్ రెడ్డి మాట్లాడటం చూస్తుంటే ఆయనలో ఉన్న ఆవేశాన్ని బట్టి మైండ్ దొబ్బేసిందేమో అనే అనుమానం వస్తుందన్నారు. నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి ప్రతాప్ కుమార్ రెడ్డికి లేదని, వారి పంచన చేరీ టిడిపి టికెట్ పొందాలి అని ఆలోచన నీలో ఒకప్పుడు ఉన్నదానిని గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన కావలిలో చేసిన పాదయాత్ర కే లోకేష్ కాళీ దుమ్ముతో నీవు 30 వేల ఓట్లతో ఓడిపోయావ్ అన్న నిజాన్ని తట్టుకోలేక కల్లు తాగిన కోతిలా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జువ్వల దీన్నే వచ్చినప్పుడు హెలిపాడ్ వద్దనే నీకు చివాట్లు పెట్టిన సంగతి మరిచిపోయావా అని గుర్తు చేశారు. గంజాయి, క్రికెట్ బుకీలు, గ్రావెల్ మాఫియా రేషన్ మాఫియా వీరందరి వద్ద అవినీతి సొమ్ము తిన్నది వాస్తవం కాదా అన్నారు.
మీ కార్యకర్త సుబ్బారెడ్డి ఇంటి బేస్ మట్టానికి గ్రావెల్ ఎక్కడిది అని ప్రశ్నించారు. ఇటీవల ఓ బ్రాహ్మణ కుటుంబం వారి పొలాన్ని తీసుకొని వారికి డబ్బులు ఇప్పటికీ కట్టకుండా హింసిస్తున్నావే నీవు ఏ పాటి వాడవు ప్రతాపరెడ్డి అంటూ విమర్శించారు. నీవు నూతనంగా ప్రారంభిస్తున్న స్కూలుకి బుడమ గుంట చెరువు నుంచి గ్రావెల్ ఎలా తోలించుకున్నావు, పర్మిషన్ తీసుకున్నావా ఒకసారి ఆలోచించుకుని కావలి ప్రజలు గ్రావెల్ మట్టి తోలుకుంటుంటే నీకు ఎందుకు అంత అక్కస్సు అని ప్రశ్నించారు. ఒక రూపాయి కట్టి మట్టి ఎత్తుకోవాలని గవర్నమెంట్ జీవో ఇచ్చిందని తెలుసుకొని మాట్లాడాలన్నారు. మాఫియాను పెంచి పోషించింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. చెన్నయపాలెం, అల్లూరు, దగదర్తి బోగోలు ప్రాంతాల్లో ఒక్కొక్కరిని నీ మనసులను పెట్టి వైసిపి పాలనలో మాఫియా నడిపించిన అవినీతి సొమ్ముతో ఎంత సంపాదించావు నీకు తెలియదా అని ప్రశ్నించారు. కావలి ప్రజలకు వారి అవసరాలకు మట్టి గ్రావెల్ అవసరమైనంత తోలుకోవాల్సిందే, అందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, అది జరుగుతుంది అని గుర్తు చేశారు. రుద్రకోటలో కొండను దోచుకుని సంపాదించుకున్నది మరిచిపోయావా అందుకు ఎలాంటి టాక్స్లు ప్రభుత్వానికి చెల్లించావో గుర్తు చేసుకోవాలన్నారు. కావలి ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతుంటే అరాచకాలు సృష్టించడం తగదన్నారు. బ్రాందీ షాపుల వద్ద, రియల్ టర్ల వద్ద, సబ్ రిజిస్టర్ వద్ద అవినీతి కమిషన్, తహసిల్దార్ల వద్ద ఆర్డిఓ ల వద్ద కన్వర్షన్లకు అని లంచాలను తిని, ఎంత అవినీతికి పాల్పడ్డావు గుర్తు చేసుకోవాలన్నారు. నీవల్ల ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. నేను కావలికి సేవ చేయాలని వచ్చానని, నేను బీద సోదరులం ఒకటే పార్టీలో ప్రజల కోసం సేవ చేస్తున్నాం అనేది గుర్తించుకోవాలని తెలిపారు. ఒకే ఒక్క పిలుపుతో మత్స్యకారులు ఖర్చు లేకుండా ఊరు వాడా వచ్చి ముఖ్యమంత్రి సభను తన ఒంటి చేతులు నడిపించిన సభను విజయవంతంగా చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు నేనున్నాను అంటూ వారికి న్యాయం చేస్తూ 60 శాతం సబ్సిడీతో పనిముట్లు, బోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. గతం కంటే ప్రస్తుతం అభివృద్ధి ఎలా ఉందో కృష్ణారెడ్డి పై ముఖ్యమంత్రి కి మంచి అభిప్రాయం ఉంది అనేది ప్రతాపరెడ్డి గుర్తించాలన్నారు. అక్రమ లేఔట్లలో 123 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఉందని అందులో 78 ఎకరాలు వెలికి తీయించిన ఘనత కృష్ణారెడ్డిది అని గుర్తించాలన్నారు. అవినీతికి పాల్పడిన రియాల్టర్ లందరూ నీ వెంట ఉన్న వారే కదా ఆనాడు నువ్వు ఏమి న్యాయం చేసావు ప్రజలకు అని విమర్శించారు. నా పాలనలో అక్రమ లేఔట్లు వేయటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని ప్రజలందరూ గమనిస్తున్నారని గుర్తు చేశారు. మన కావలిని మనం అభివృద్ధి చేసుకోవాలి తప్ప స్వార్థపూరిత రాజకీయాల కోసం గబ్బు చేసుకోవడం మంచిది కాదనేది ప్రతాపరెడ్డి గుర్తించాలన్నారు.
సూపరిపాలన అందిస్తూ ముందుకు పోతున్నానని తెలిపారు. సుభాని బాధితుల నుంచి నష్టపోయిన డబ్బులు 24 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా వాటిపై అందిన ఫిర్యాదులు లను పోలీస్ స్టేషన్లో 100 పరిచి ఉన్నాయన్నారు 100 కోట్లు కావ్య తిన్నాడని ఏ విధంగా చెబుతున్నావు ప్రతాపరెడ్డి అని ప్రశ్నించారు సుభాని అవినీతిని నీ పరిపాలనలో ప్రోత్సహించి అవినీతికి పాల్పడ్డావని విమర్శించారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సుభాని అవినీతిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాను కనుకనే అతని బ్యాంకుల నుండి 6 కోట్లు సీట్ చేపిస్తున్నట్లు అతని ఆస్తులు అన్ని సీజ్ చేసి కస్టర్డ్ వెళ్లే ఉంచామన్నారు 14 కోట్ల 70 లక్షలు ఆస్తులను సీజ్ చేశామన్నారు తొందరలో బాధితులకు నగదు అందజేస్తామన్నారు. నా క్వారీ జోలికి వస్తే తగ్గేది లేదని ఒంటరిగానే కావ్య కృష్ణారెడ్డి వచ్చి నీకు బుద్ధి చెప్తారని కౌంటర్ ఇచ్చారు. మీకు అవసరమైతే నెల్లూరు వాళ్లని పిలిపించుకుంటావ్ తప్ప నేను మాత్రం ఒంటరిగానే మీ ఇంటికొచ్చి తగిన బుద్ధి చెప్తాను అన్నారు. ఇప్పటికైనా నీవు కాని, నీ చెంచా గాళ్ళు గాని అనవసరంగా కావలి అభివృద్ధి గురించి కావలి ఎమ్మెల్యే గురించి మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అభివృద్ధిని ప్రోత్సహిస్తే అన్ని విధాల బాగుంటుందని తెలిపారు..ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టిడిపి సీనియర్ నాయకులు గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, కండ్లగుంట మధుబాబు నాయుడు, తట్టవత్తి రమేష్,తట్టవతి వాసు, దావులూరు దేవకుమార్, I-TDP President కంచర్ల కళ్యాణ్ చక్రవర్తి (చక్రి), ఆరా మస్తాన్, జంపాని ప్రసాద్, వల్లేరు కిరణ్, గోచిపాతల సంజయ్, కమల్, పవన్, తదితరులు పాల్గొన్నారు.