అనారోగ్యంతో ఉన్న టీడీపీ నేత కోట శ్రీనివాసులు రెడ్డిని పరామర్శించిన..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు
కావలి, జూన్ 1:
కావలి పట్టణం 25వ వార్డు టీడీపీ అధ్యక్షులు కోట మనోహర్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా కోట శ్రీనివాసులు రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీనివాసులు రెడ్డి ఆరోగ్యంపై వివరాలు తెలుసుకుని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 25వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి విక్రమ్ రెడ్డి,టిడిపి సీనియర్ నాయకులు కొండప నాయుడు, శేషయ్య, బీబీజాన్,అల్లా శీను, 26వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి గంగినేని వెంకటేశ్వర్ నాయుడు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.