వైసీపీ మూకల దాడిలో తీవ్రగాయాలైన టీడీపీ మాజీ సర్పంచ్ దళిత నేత కృష్ణయ్యని పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

వైసీపీ మూకల దాడిలో తీవ్రగాయాలైన టీడీపీ మాజీ సర్పంచ్ దళిత నేత కృష్ణయ్యని పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి . కృష్ణయ్యకి టీడీపీ అండగా ఉంటుందని హామీ. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచన

కావలి మండలం చెన్నాయపాళెంలో వైసీపీ మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిపోయిన ప్రసాద్, ఆయన సోదరుడు, ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు, అనుచరులు.... టీడీపీ మాజీ సర్పంచ్, దళిత నాయకుడు అరగల కృష్ణయ్యతో పాటు మరికొందరిపై  మారణాయుధాలు, కర్రలతో దాడి చేసిన ఘటన అందర్నీ తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణయ్య ప్రాణాపాయ పరిస్థితిలో ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి కృష్ణయ్యని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులని అడిగి తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులను వెంటనే శిక్షించాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.




google+

linkedin

Popular Posts